రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై విచారణ చేసేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. దీనిలో టి.శివశంకర్, తంబళ్ల రమాదేవి, టి.సి.వరుణ్ ఉన్నారు. ప్రసార మాద్యమాల్లో వచ్చిన వార్తలపై విచారణ చేయాలని ఆ కమిటీని పార్టీ ఆదేశించింది. ఈ కమిటీ ముందు ఏడు రోజుల్లోపు ఎమ్మెల్యే శ్రీధర్ హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కమిటీ నివేదిక ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేను ఆదేశించింది.


