బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తొలిసారి బిలియనీర్ల క్లబ్‌లో చేరారు. రూ.12,490 కోట్ల నెట్‌వర్త్‌తో తొలిసారి ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన ముకేశ్ అంబానీనే టాప్‌లో ఉన్నారు. ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 14వ ఎడిషన్ ప్రకారం ముకేశ్ అంబానీ కుటుంబం భారత్‌లో అత్యంత సంపన్నులుగా నిలిచారు. అంబానీ ఫ్యామిలీ రూ.9.55 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం రూ.8.15 లక్షల కోట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో రోష్ణి నాదర్ మల్హోత్రా, ఆమె కుటుంబం తొలిసారి మూడోస్థానంలోకి వచ్చింది. రూ.2.84 లక్షల కోట్లతో ఆమె భారత్‌లో అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచారు.


