వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన వైవిధ్య కథాచిత్రం శ్రీచిదంబరం. వినయ్ రత్నం దర్శకుడు. చింతా వినీషరెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో టీజర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ప్రముఖ హీరో సత్యదేవ్, దర్శకులు వశిష్ట, వెంకటేష్ మహా, యదువంశీ, సాయిమార్తాండ్, దర్శకులు సందీప్, సుజిత్ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. సత్యదేవ్ టీజర్‌ని ఆవిష్కరించారు. ఈ కథ నాకు బాగా నచ్చింది. గ్లామర్ కంటే గ్రామర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, కొత్తవాళ్లతో సినిమా చేశాను. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు అని నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి అన్నారు.
ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుందని హీరో వంశీ తుమ్మల నమ్మకం వెలిబుచ్చారు.నిర్మాతల సహకారం వల్లే ఈ సినిమా ఇంతబాగా వచ్చిందని, చేసే పనిలో నిజాయితీ ఉంటే యూనివర్స్ సహకరిస్తుందనడానికి ఈ సినిమానే ఉదాహరణ అని దర్శకుడు చెప్పారు. వింటేజ్ విలేజ్ డ్రామాగా, ఓ అందమైన ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతున్నట్టు టీజర్ చెబుతున్నది. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.


