శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం లో, ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఎపిఎన్ఆర్ టిఎస్) సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) యూరప్‌లోని వివిధ నగరాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, మిల్టన్ కీన్స్‌లోని శ్రీ శ్రీనివాస (బాలాజీ) అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. టీడీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లికార్జున ప్రసాద్ పర్యవేక్షణలో, పూజారి రంగనాథ నేతృత్వంలో, తిరుమల నుండి వచ్చిన వేద పండితులు సంప్రదాయ మంత్రోచ్చారణలతో కల్యాణ మహోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1,800 మందికి పైగా భక్తులు హృదయపూర్వకంగా పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో కల్యాణ మహోత్సవాన్ని వీక్షించారు.


