ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు నిందితులకు సుప్రీంకోర్టు లో ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టును నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఆశ్రయించారు. న్యాయస్థానంలో నిందితులు వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో సరెండర్ నుంచి నిందితులకు మినహాయింపు ఇచ్చింది న్యాయస్థానం. 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రిజైండర్ దాఖలు చేసేందుకు ఐదు రోజుల సమయం కోరారు నిందితుల తరపు న్యాయవాదులు. డిసెంబరు 15వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది. ఇటీవల లిక్కర్ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును లిక్కర్ కేసు నిందితులు ఆశ్రయించిన విషయం తెలిసిందే.


