My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - Telangana

ఈ నెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 26 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన ఆర్థిక శాఖ, బడ్జెట్ ప్రతిపాదనలకు తుది మెరుగులు దిద్దుతోంది. ఇక ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈనెల 28న శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉందని […]

తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 26 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన ఆర్థిక శాఖ, బడ్జెట్ ప్రతిపాదనలకు తుది మెరుగులు దిద్దుతోంది. ఇక ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈనెల 28న శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌పై సమగ్రంగా చర్చించేందుకు వీలుగా సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సభలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానం ఇవ్వడంతో పాటు, పలు కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదించుకోవాలని అధికార పక్షం భావిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.