తెలంగాణ ఓవర్సీస్ విద్యార్థులకు గుడ్ న్యూస్. గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 2022 నుంచి ఉన్న మొత్తం బకాయిలు క్లియర్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులకు భారీ ఊరట లభించనుంది.


