అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో థ్యాంక్స్ గివింగ్ డే ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు టర్కీ కోళ్లకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. వాడిల్, గోబుల్ అనే రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ కార్యక్రమానికి ముందు ది నేషనల్ థ్యాంక్స్ గివింగ్ టర్కీ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి వాడిల్ , గోబుల్ అనే రెండు టర్కీ కోళ్లు ప్రత్యేక అతిథులుగా రావాల్సి ఉంది. అయితే వాడిల్ మాత్రమే ఈ కార్యమక్రమంలో ప్రత్యక్షమైంది. అయినప్పటికీ ఈ రెండు కోళ్లకూ ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు. శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు, ఇతర అధికారులు హాజరయ్యారు.


