My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

అగ్నీ-3 పరీక్ష విజయవంతం

భారత సైనిక దళాలకు చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో తాజాగా జరిగిన అగ్ని-3 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్ టెస్టు రేంజ్‌‌లో  ఈ పరీక్ష విజయవంతమైందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సాంకేతిక, కార్యనిర్వహణ లక్ష్యాలు అన్నిటినీ మిసైల్ అందుకుందని రక్షణ శాఖ తెలిపింది. ఈ పరీక్షతో భారత దళాల సామర్థ్యం, యుద్ధ సన్నద్ధత మరింత పెరిగిందని పేర్కొంది. అగ్నీ సిరీస్‌కు సంబంధించి భారత్ వద్ద వివిధ రకాల మిసైల్స్ ఉన్న విషయం […]

భారత సైనిక దళాలకు చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో తాజాగా జరిగిన అగ్ని-3 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్ టెస్టు రేంజ్‌‌లో  ఈ పరీక్ష విజయవంతమైందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సాంకేతిక, కార్యనిర్వహణ లక్ష్యాలు అన్నిటినీ మిసైల్ అందుకుందని రక్షణ శాఖ తెలిపింది. ఈ పరీక్షతో భారత దళాల సామర్థ్యం, యుద్ధ సన్నద్ధత మరింత పెరిగిందని పేర్కొంది.

అగ్నీ సిరీస్‌కు సంబంధించి భారత్ వద్ద వివిధ రకాల మిసైల్స్ ఉన్న విషయం తెలిసిందే. అగ్నీ-1 మిసైల్ 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అగ్నీ-2 మిసైల్‌ రేంజ్ 2 వేల కిలోమీటర్లు. అగ్నీ-3 మిసైల్ 3 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను, అగ్నీ-4 మిసైల్‌ 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఇక అగ్నీ-5 మిసైల్ రేంజ్ అత్యధికంగా 5 వేల కిలోమీటర్లు.అగ్నీ-1 మిసైల్‌తో 220 కిలోమీటర్ల కనిష్ఠ దూరంలోని లక్ష్యాలను కూడా ధ్వంసం చేయొచ్చని డీఆర్‌డీఓ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా 150-300 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించే పృథ్వి సిరీస్ మిసైల్స్‌కు అనుబంధంగా అగ్నీ-1 మిసైల్స్‌ను వినియోగించుకోవచ్చని అన్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.