భయంకరమైన ఢిల్లీ పేలుళ్ల సూత్రధారులను కోర్టు(న్యాయం) ముందు నిలబెట్టి శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ కుట్రను దర్యాప్తు సంస్థలు ఛేదిస్తాయని తెలిపారు. భూటాన్ రాజధాని థింపూలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బాధిత కుటుంబాల శోకాన్ని నేను అర్థం చేసుకున్నాను. దేశం మొత్తం వారికి అండగా ఉంది. ఈ ఘటన గురించి నేను ఎప్పటికప్పుడు అన్ని దర్యాప్తు సంస్థల నుంచి వివరాలు తెలుసుకుంటున్నాను అని ఆయన అన్నారు.


