ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం దర్యాప్తులో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు ఇతర మహిళలతో లైంగిక సంబంధాలు ఉన్నట్టు బయటపడడం వల్లనే తమ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పినట్టు బిల్‌గేట్స్ మాజీ భార్య మిలిందా వెల్లడించారు. ఈ వివరాలు తెలియడంతో తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యానని తెలిపారు. వైవాహిక బంధం విలువలు ఆయన నిలబెట్టుకోకపోవడం వల్లనే విడాకులు తీసుకున్నట్టు చెప్పారు. దర్యాప్తులో బయటపడిన విషయాలపై ఆయనే సమాధానం చెప్పుకోవాలని, తాను కాదని వ్యాఖ్యానించారు. ఎపిస్టీన్‌ఫైల్స్‌లో బాధితులుగా ఉన్న మహిళలకు న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ బిల్‌గేట్స్‌మిలిందా దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు. వీరికి 20 ఏళ్లకు పైబడిన ముగ్గురు పిల్లలున్నారు. అయితే ఎప్‌స్టీన్‌తో గేట్స్‌కు సంబంధాలు ఉండడంతో ఏమాత్రం ఇష్టపడని మిలిందా ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు.


