యంగ్ హీరో తిరువీర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఓ సుకుమారి. ఈ మూవీలో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటిస్తోంది.బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన తిరువీర్ భరత్ భూషణ్ డైరెక్షన్లో సినిమాను ప్రకటించాడని తెలిసిందే. తాజాగా తిరువీర్ పోషిస్తున్న లుక్‌ను షేర్ చేశారు. ఇందులో యాదగిరి పాత్రలో నటిస్తున్నాడు తిరువీర్. కర్లీ హెయిర్‌తో లుంగీ, బనియన్ మెడలో టవాల్‌తో బ్రష్ వేసుకుని నడుచుకుంటూ వస్తున్న స్టిల్ న్యాచురల్‌గా కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ మూవీని గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 19 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి భరత్ మాచిరాజు సంగీతం అందిస్తున్నాడు. సీహెచ్ కుశేందర్ సినిమాటోగ్రఫర్ కావడంతో సినిమాపై హైప్ పెరిగిపోతుంది. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.


