నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం అఖండ 2. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో అఖండ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముంబై పీవీఆర్ జుహూలో అఖండ 2 ఫస్ట్ సింగిల్ తాండవం సాంగ్ ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఇప్పటి వరకు బాలయ్య సినిమాలు హైదరాబాద్ లేదా ఆంధ్రా/తెలంగాణలో ప్రమోషన్స్ చేసేవి. కానీ ఈసారి పాన్ ఇండియా టార్గెట్‌తో నేరుగా ముంబైలో ఈవెంట్ ప్లాన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే ఈవెంట్‌తో సినిమా ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభం కానున్నాయి. అఖండ 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.


