My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

భారత విదేశాంగ శాఖ  కీలక నిర్ణయం …  ఢాకాలో

పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న వేళ భారత విదేశాంక శాఖ  కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాలో తీవ్రమవుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢాకా లోని వీసా కేంద్రాన్ని  మూసివేసింది. బంగ్లాదేశ్ నాయకులు, అసాంఘిక శక్తుల నుంచి బెదిరింపుల నేపథ్యంలో అక్కడి వీసా అప్లికేషన్ సెంటర్లో సేవలకు మంగళం పాడింది భారత్. బుధవారం మధ్యాహ్నం 2:00 గంటల నుంచి ఈ కేంద్రాన్ని మూసేస్తున్నట్టు,  పరిశీలనలో ఉన్న దరఖాస్తుల తేదీలను మార్చినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఢాకాలోని జమున […]

పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న వేళ భారత విదేశాంక శాఖ  కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాలో తీవ్రమవుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢాకా లోని వీసా కేంద్రాన్ని  మూసివేసింది. బంగ్లాదేశ్ నాయకులు, అసాంఘిక శక్తుల నుంచి బెదిరింపుల నేపథ్యంలో అక్కడి వీసా అప్లికేషన్ సెంటర్లో సేవలకు మంగళం పాడింది భారత్. బుధవారం మధ్యాహ్నం 2:00 గంటల నుంచి ఈ కేంద్రాన్ని మూసేస్తున్నట్టు,  పరిశీలనలో ఉన్న దరఖాస్తుల తేదీలను మార్చినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఢాకాలోని జమున ఫ్యూచర్ పార్క్‌లో భారత వీసా అప్లికేషన్ సెంటర్ ఉంది. మనదేశం రావాలనుకునే బంగ్లాదేశీయులకు ఈ కేంద్రం నుంచే వీసాలు మంజూరు చేస్తారు. అయితే,  ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు కొరవడ్డాయి. ఆ దేశంలో రోజురోజుకు సురక్షిత వాతావరణం తగ్గిపోతుండడాన్ని సీరియస్‌గా తీసుకున్న విదేశీ మంత్రిత్వ శాఖ భారత్‌లోని బంగ్లా దౌత్యాధికారికి బుధవారం ఉదయం సమన్లు జారీ చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.