My Telugu NRI

Mobile Scrollable Menu
- Andhra - Latest News

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ : మంత్రి కొండపల్లి

 ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ కార్యక్రమం అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం  జిల్లాలోని గంట్యాడ మండలంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా  కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా దర్బార్‌లో సామాన్య ప్రజల నుంచి వస్తున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని అన్నారు. అధికార యంత్రాంగం సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేయాలని తెలిపారు. ప్రజల దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను […]

 ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ కార్యక్రమం అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం  జిల్లాలోని గంట్యాడ మండలంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా  కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా దర్బార్‌లో సామాన్య ప్రజల నుంచి వస్తున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని అన్నారు. అధికార యంత్రాంగం సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేయాలని తెలిపారు. ప్రజల దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాదర్బార్ నిర్యహించటం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి 124 అర్జీలు వచ్చాయన్నారు. రెవిన్యూ, విద్యుత్, పెన్షన్లు, ఉపాధి అవకాశాల గురించిన అర్జీలు ప్రజలు సమర్పించినట్లు చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి వాటికి పరిష్కారం చూపాలన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు కార్యాలయ సిబ్బంది సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాలని  ఆదేశాలు జారీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.