రవితేజ నటిస్తున్న చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. డింపుల్ హయాతి, అషికా రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్లు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రొమాంటిక్, కామెడి సినిమాగా ఇది రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు. వదిన వాళ్ల చెల్లి అంటే నా వైఫేగా అంటూ రవితేజా తనదైన శైలీలో కామెడీని పండించారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భీమ్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13, 2026న విడుదల కానుంది. పండుగ సీజన్లో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ టెన్షన్ కామెడీ ఎంటర్టైనర్, రవితేజ కెరీర్లో మరో హిట్‌గా నిలుస్తుందేమో చూడాలి.


