టాలీవుడ్ సీనియర్ నటీనటులు శివాజీ, లయ చాలా కాలం తర్వాత జంటగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే పంచాయితీ సెక్రటరీ అయిన శ్రీరామ్ నీతి, నిజాయితీ అంటూ బ్రతుకుతుంటాడు. అయితే అతడి జీవితంలోకి అనుకోకుండా వచ్చిన సంఘటనలు ఏంటి.. అతడిని పోలీసులు, రౌడీలు ఎందుకు వెతుకుతుంటారు అనేది ఈ సినిమా కథ. క్రైమ్ కామెడీగా ఈ చిత్రం రాబోతుంది. ఒకప్పుడు వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న శివాజీ, లయ ఇందులో మళ్లీ జంటగా నటిస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.


