తన పేరుతో ఎలాంటి సంస్థలు లేవని, అలా సంస్థలు స్థాపించి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కొంతమంది కేటీఆర్ సేవా సమితి, కేటీఆర్ సేన లాంటి పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు చేపడుతున్నట్లు తెలిసిన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు.
తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని కెటిఆర్ స్పష్టం చేశారు. ఎవరైనా పని చేయాలనుకుంటే బిఆర్ఎస్తో కలిసి పని చేయాలని, తన పేరుతో సంస్థలు ఏర్పాటు చేసేందుకు మాత్రం అనుమతి లేదని పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలకు ఎలాంటి గుర్తింపు, అనుమతి లేదన్నారు. తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలు వెంటనే ఆపాలని తెలిపారు. తనపై అభిమానం ఉంటే బిఆర్ఎస్తో కలిసి పని చేయవచ్చని పిలుపునిచ్చారు.


