ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కాలినడకన తిరుమలకు చేపట్టిన సంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తైంది. షాద్‌నగర్ నుంచి గత నెల 19న ఈ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 23 రోజుల తర్వాత తిరుమలకు చేరుకున్నారు. సుమారు 540 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లి బండ్ల గణేశ్ తిరుమలకు చేరుకున్నారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండ్ల గణేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. యాత్రను పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్వామివారి ఆశీర్వాదంతో ఏ ఆటంకం లేకుండా 23 రోజుల్లో తిరుమలకు చేరుకున్నానన్నారు. నా జన్మలో ఇదో అద్భుత ఘట్టం. స్వామి వారిని నమ్ముకుని ఎవరూ నష్టపోలేదు అని గణేశ్ చెప్పారు. ఈ జన్మాంతం స్వామి వారికి రుణపడి ఉంటానని, శ్రీవారి సేవ చేసుకుంటానని బండ్ల గణేశ్ భక్తిభావంతో అన్నారు.


