కటారి త్రినాథ్ కటారి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇట్లు మీ ఎదవ. వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బళ్లారి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాహితి అవంచ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యూత్ ఫుల్ ఫన్, బ్యూటీఫుల్ లవ్ స్టొరీ, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ట్రైలర్ అదిరిపోయింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో, దర్శకుడు త్రినాథ్ కటారి మాట్లాడుతూ.. ‘ ఈ సినిమాకి కథే హీరో. ఇందులో నేను ఎదవ అని ఒక క్యారెక్టర్ చేశాను. ఇది ఒక తండ్రీకొడుకులు కథ, తండ్రీకూతుళ్ల కథ. ఒక అమ్మాయి అబ్బాయి కథ. ఈ ముగ్గురు మధ్య ఉండే లవ్ స్టోరీ. నిర్మాత బళ్లారి శంకర్ చాలా మంచి వ్యక్తి. పట్నాయక్‌కు ఈ కథ చెప్తున్నప్పుడే ఒక హిట్ సినిమాకి పనిచేయబోతున్నాం అని చెప్పారు. అది చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాలో అందరూ మంచి పాత్రలు చేశాం. 100% మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తాం. ‘ అని తెలిపారు.


