దేశరాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంపై సర్వోన్నత న్యాయంస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పది ఏండ్లు పైబడిన డీజిల్ తో నడిచే వాహనాలు, అలాగే 15 ఏండ్లు పైబడిన పెట్రోల్ వాహనాలను నగరంలో తిరగడానికి వీలులేదని, వీటిపై నిషేధం విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. డిసెంబర్ 18నుంచి సదురు వాహనాలపై నిషేధం అమలోకి వస్తుందని ధర్మాసనం వెల్లడించింది. ఆలోపు సదురు వాహనాల యాజమాన్యలతో ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించింది. ఢిల్లీలో తిరగడానికి బీఎస్-4 ఇంజన్ వాహనాలకు మినహయింపు ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. ఢిల్లీలో దీూ4 ఇంజిన్లు కలిగిన వాహనాలు మాత్రమే తిరుగుతున్నట్లు తేలితే వాటిపై చర్యలు తీసుకోకుండా మినహాయింపు ఇస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


