అమెరికాలో టెక్‌టాక్ యాప్ ఫీచర్ డిసైడ్ అయ్యింది. ఆ దేశంలో టిక్‌టాక్ సేవలు దేశీయ సంస్థలకు విక్రయించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలో టెక్ దిగ్గజం ఒరాకిల్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ కీలక పాత్ర పోషించనున్నాయి. చైనా కు చెందిన మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌పై అమెరికా యూజర్ల డేటా భద్రత విషయంలో ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి ఈ డీల్‌ను రూపొందించారు.


