టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన వివాహంపై ఎంతోకాలంగా సాగుతున్న ఊహాగానాలకు స్వయంగా ముగింపు పలికారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన వచ్చే ఏడాదిలో తన పెళ్లి జరగబోతోందని అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదంతో నాకు మంచి సినిమాలు, మంచి జీవితం దక్కాయి. వచ్చే ఏడాదిలోనే నా వివాహం జరుగుతుంది.కొత్త సంవత్సరం దృష్ట్యా, స్వామివారి ఆశీస్సులతో ముందుకు సాగాలని తిరుమల వచ్చినట్లు తెలిపారు.


