రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తక్షణమే ఆ దేశంనుంచి చమురు కొనుగోళ్లు ఇలాగే కొనసాగితే న్యూఢీల్లీ భారీ సుంకాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. రష్యాతో ఇకపై చమురు వ్యాపారం ఉండబోదని మోదీ నాతో చెప్పారని, అయితే ఇంకా కొనుగోళ్లు జరుపుతున్నట్లు నా దృష్టికి వచ్చిందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఆ దేశంపై భారీ సుంకాలు విధిస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మీకు మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని భారత ప్రభుత్వం చెబుతున్నదని ట్రంప్‌ను ప్రశ్నించగా, వాళ్లు అలా చెప్పాలనుకుంటే కచ్చితంగా భారీ సుంకాలు చెల్లించాల్సి వస్తుందంటూ బెదిరింపులకు దిగారు. కానీ వాళ్లు అలా చేయాలనుకోరని అనుకుంటున్నానని చెప్పారు.


