కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం పార్టీ వ్యవస్థాపకుడు, తమిళ స్టార్ నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాష్ట్రవ్యాప్త పర్యటనను వాయిదా వేసుకున్నారు.ఈ విషయాన్ని టీవీకే పార్టీ అధికారికంగా ప్రకటించింది. కరూర్ ఘటన నేపథ్యంలో తమ పార్టీ నాయకుడు విజయ్ రాష్ట్రవ్యాప్త పర్యటనను రెండు వారాల పాటూ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. విజయ్ ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. బహిరంగ సభలకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు పోలీసుల అనుమతితో వచ్చే వారం విజయ్ కరూర్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించనున్నట్లు సమాచారం.


