టాలీవుడ్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ఇప్పుడు మరింత జోరందుకున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో వీరి పెళ్లి జరగనుందనే టాక్ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సినీ వర్గాల నుంచి లభిస్తున్న సమాచారం ప్రకారం రాజస్థాన్‌లోని అందమైన నగరం ఉదయ్‌పూర్ లోని ఓ రాయల్ ప్యాలెస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సింపుల్‌గా పెళ్లి వేడుక జరపాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 26 తేదీని ముహూర్తంగా ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.పెళ్లి వేడుక ఉదయ్‌పూర్‌లో సాదాసీదాగా జరిగినా, అసలు హంగామా మాత్రం హైదరాబాద్‌లోనే ఉండబోతుందని టాక్.
మార్చి 4న నగరంలోని ప్రముఖ వేదికలో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరవుతారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. ఈ ఇన్విటేషన్ ప్రకారం వారి వివాహం ఫిబ్రవరి 26న వివాహవం జరగనుందని అర్ధమవుతుంది. ఈ వెడ్డింగ్ కార్డ్ బట్టి రష్మికవ- విజయ్ దేవరకొండ వివాహం చాలా సీక్రెట్‌గా జరగనుందని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.


