నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్నా పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు దాదాపు ఖాయం అయిపోయింది. వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని విజయ్ స్వగృహంలో రెండు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహానికి ముహూర్తం కుదిరినట్టు తెలుస్తోంది. కాగా, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి గీత గోవిందం, డియర్ కామ్రెడ్ సినిమాల్లో నటించారు. ఇందులో గీత గోవిందం సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమా సమయంలోనే ఏర్పడిన పరిచయమే ప్రేమగా చిగురించింది. అప్పటి నుంచి విజయ్ , రష్మిక ప్రేమలో ఉన్నప్పటికీ ఎప్పుడు బయటపడలేదు. కానీ వారు పెట్టిన పోస్టులు మాత్రం వారి ప్రేమ వ్యవహారాన్ని లీక్ చేశాయి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్ ఇప్పుడు ఒక్కటి కాబోతున్నారని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాబోయే జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.


