విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు. దిల్ రాజు నిర్మాణంలో, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరెకెక్కనుంది. మాస్ యాక్షన్, రూరల్ డ్రామా నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రం ప్రారంభ వేడుక హైదరాబాద్‌లో సైలెంట్‌గా జరిగింది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అంచనాలు నెలకొన్నాయి. కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే, అనే పంచ్ లైన్‌తో, కత్తి పట్టుకున్న రక్తంతో తడిచిన చేయి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇప్పటికే విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో నడవనుందని విజయ్ వెల్లడించాడు.
ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కి మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కి కీర్తి సురేష్ హాజరుకావడం, ఈ సినిమాలో ఆమెనే హీరోయిన్ అని గట్టి సంకేతాలు ఇస్తోంది. గతంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా ఉండనుందని రూమర్లు రాగా, ఇప్పుడు ఈ పిక్‌తో క్లారిటీ వచ్చినట్టే అని అంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తైన నేపథ్యంలో త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


