మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటికి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు జగన్ కు షాక్ ఇచ్చారు.ఇబ్రహీంపట్నం లోని జోగి రమేశ్ ఇంటికి వెళ్లడంపై ఆంక్షలు విధించారు విజయవాడ పోలీస్ కమిషనర్. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఉదయం వేళలో విజయవాడలో భారీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ నేపథ్యంలో దుర్గమ్మ వారిధి మీదుగా కాకుండా, వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలని వైఎస్ జగన్‌కు కమిషనర్ కార్యాలయం నోటీసుల్లో స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై జోగి రమేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోవైపు కొందరు జోగి ఇంటిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే పరామర్శించేందుకు జోగి ఇంటికి జగన్ వెళ్తున్నారు.


