ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినట్లు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవి, అబద్ధమని ఈసీ పేర్కొన్నది. ఓట్లను ఆన్లైన్ డిలీట్ చేయలేరని ఎన్నికల సంఘం చెప్పింది. ఆన్లైన్ పద్ధతిలో ప్రజలు ఓట్లను డిలీట్ చేయడం కుదరదని, రాహుల్ గాంధీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, బాధిత వ్యక్తి విజ్ఞాపన విన్న తర్వాతనే డిలీట్ ప్రక్రియ జరుగుతుందని ఈసీఐ ఓ ప్రకటనలో పేర్కొన్నది.
కర్నాటకలోని అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లు డిలీట్ అయినట్లు రాహుల్ చేసిన ఆరోపణలపై ఈసీ స్పందిస్తూ.. ఆ నియోజకవర్గంలో జరిగిన అక్రమాలను 2023లో ఈసీనే బయటపెట్టినట్లు పేర్కొన్నది. ఓటర్ల తొలగింపు కోసం ప్రయత్నాలు జరిగాయని, ఈ ఘటన పట్ల ఎన్నికల సంఘం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఈసీ తన స్టేట్మెంట్లో తెలిపింది.


