మెక్సికో కు చెందిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో ఒసెగుయెరా అలియాస్ ఎల్ మెంచో ను హతమార్చిన ఘనతను పూర్తిగా తన ఖాతాలో వేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. కానీ మెక్సికో మాత్రం ఎల్ మెంచో అంతానికి పక్కా ప్లాన్ చేసింది అమెరికా కాదని, తమ స్పెషల్ ట్రూప్స్ అని చెబుతోంది. మెక్సికో సైన్యం చేపట్టిన స్పెషల్ ఆపరేషన్లో ఎల్ మెంచో హతమయ్యాడు. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఏంటో అన్నింటిలో మేమే గెలుస్తున్నాం. ఇలా అన్నింటిలో విజయం సాధించడం కూడా న్యాయం కాదు అని ట్రంప్ పేర్కొన్నారు.


