దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తిరిగి బాలీవుడ్ బాట పట్టి తెరకెక్కిస్తున్న చిత్రం పోలీస్ స్టేషన్ మే భూత్. మనోజ్ బాజ్‌పాయ్, బాలీవుడ్ నటి జెనీలియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబయ్‌లో శర వేగంగా జరుగుతోంది. తాజాగా వర్మ ఈ మూవీ నుంచి రమ్యకృష్ణ లుక్ విడుదల చేశాడు. గదవ నుంచి నుదుటి వరకు చుక్కల బొట్టుతో కనిపిస్తున్న రమ్యకృష్ణ మెడలో విభిన్నమైన ఆభరణాలు వేసుకొని నయా అవతార్‌లో కనిపిస్తుంది. బాహుబలి ప్రాంచైజీలో శివగామి ఉగ్రరూపం చూపించి రమ్యకృష్ణ ఒక్కసారిగా ఇలా మార్చేసి సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదల చేసిన రమ్యకృష్ణ లుక్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. మనోజ్ బాజ్‌పేయి, ఆర్జీవీ 1998లో వచ్చిన కల్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా సత్యకు కలిసి పనిచేశారని తెలిసిందే. ఈ కాంబో యాక్షన్ డ్రామా సర్కార్ 3 కూడా వచ్చింది.


