డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వివాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు స్పందించారు. ఈ సందర్భంగా రామచంద్ర రావు మీడియాతో మాట్లాడారు. సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని బెదిరించడంలో పెద్దవారి హస్తముందని కొండా కుటుంబ సభ్యులు అంటున్నారని, దీని వెనుక ఎవరెవరు ఉన్నారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఓ మంత్రి ఇంట్లోకి వెళ్ళారు. మంత్రి కూతురు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు అనేక మందిపై ఎలిగేషన్ చేశారు. సిమెంట్ కంపెనీల యజమానులను బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. కాంగ్రెస్, కరెప్షన్ సమానంగా ప్రయాణం చేస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దీనిపై వివరణ ఇవ్వాలి. ఇది దోచుకునే ప్రభుత్వంగా మారిపోతోంది. టికెట్లు కూడా దోచుకునే వారికే ఇస్తున్నారు అని మండిపడ్డారు.
మంత్రి కూతురు చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం దోచుకున్న సొత్తు పంచుకుంటున్నారని, ఇప్పుడు దోచుకున్న సొత్తు పెంచుకునేందుకు తప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం దోచుకునే ప్రభుత్వమా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణను దోచుకున్న పార్టీలను ఓడించాలన్నారు. కాంగ్రెస్ డీఎన్ఏ, అవినీతి, తప్పుడు పాలన, దోపిడీ అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలపాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని వెల్లడించారు.


