ఇటీవల కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీలో ప్రధాని మోడీనుద్దేశించి మోడీ మీ కోసం సమాధి ఈరోజు కాకపోతే రేపు అయినా తవ్వబడుతుంది అని జైపూర్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మంజు లతా మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీనా అన్న ఈ వ్యాఖ్యలపై లోక్‌సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ చర్చపై కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ స్పందించారు. అసలు ఈ అంశంపై పార్లమెంటులో చర్చ ఎందుకు? అని ప్రియాంక ప్రశ్నించారు. నేడు పార్లమెంటు వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్ర పార్లమెంటరీ మంత్రి కిరణ్ రిజిజు తానే స్వయంగా సభా కార్యకలాపాలకు ఎందుకు అంతరాయం కలిగిస్తున్నారని మీరు (మీడియా) అడగరు. కనీసం వేదిక నుంచి ఎవరు అనలేదు. మోడీనుద్దేశించే అన్నవ్యాఖ్యలు అస్పష్టంగా ఉన్నాయి. అయితే, ఈ విషయాన్ని సభలో ఎందుకు లేవనెత్తుతున్నారు? వారు (అధికార పక్షం) సభను నడపాలని కోరుకోవడం లేదు. ఢిల్లీ కాలుష్యంపై చర్చ జరగాలని మేము డిమాండ్ చేశాము. కానీ వారు కాలుష్యంపై చర్చ జరగనివ్వడం లేదు్ణ అని ఆమె అన్నారు.


