రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసినట్లు వచ్చిన వార్తలను భారత్‌తో సహా పలు దేశాలు ఖండించిన విషయం తెలిసిందే. అయితే భారత ప్రధాని మోదీ చేసిన ఖండనను ఉక్రెయిన్ తప్పుపట్టింది. కొన్ని దేశాలు గందరగోళంగా, అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నాయ ని, పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడి ఘటనను ఖండిస్తున్నట్లు ఇండియా, యూఏఈ దేశాలు పేర్కొన్నాయని, వాస్తవానికి ఆ దాడి జరగలేదని ఆన్‌లైన్ మీడియా సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.


