My Telugu NRI

Mobile Scrollable Menu
- National & International

అమెరికాలో స్కూల్‌లో కాల్పులు

మినియాపోలిస్‌లో ఓ క్యాథలిక్ స్కూల్లో కాల్పులు జరగడం ఫలితంగా ముగ్గురు మృతి మరియు 17 మందికి గాయాలైనట్లు సమాచారం.

అమెరికాలోని మిన్నెసోటాలోని ఒక క్యాథలిక్ పాఠశాలలో కాల్పుల సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, 14 మంది విద్యార్థులు సహా మొత్తం 17 మంది గాయపడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు చిన్నారులు సహా షూటర్ కూడా చనిపోయాడు. ఈ ఘటనపై గవర్నర్ విచారం వ్యక్తం చేయగా, అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందవద్దు అన్నారు.

Where can I get some?

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. పాఠశాలలో చోటు చేసుకున్న కాల్పుల్లో ఇద్దరు చిన్నారులతో పాటుగా.. కాల్పులకు పాల్పడిన దుండగుడు కూడా చనిపోయాడు. మరో 17 మందికి గాయాలయ్యాయని.. వీరిలో 14 మంది పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. ఈ సంఘటన అమెరికా మిన్నెసోటా మినియాపొలిస్‌లో ఉన్న ఓ క్యాథలిక్ పాఠశాల ప్రాంగణంలో వెలుగు చూసింది. స్కూల్ తెరిచిన రెండు రోజులకే ఇలాంటి సంఘటన వెలుగు చూడటం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

బుధవారం నాడు అనగా ఆగస్టు 27న ఈ దారుణం వెలుగు చూసింది. యానుసియేషన్ క్యాథలిక్ చర్చికి అనుసంధానంగా ఉన్న మినియాపొలిస్ పాఠశాలలో దుండగుడు ఒకరు కాల్పులకు పాల్పడ్డాడు. విద్యార్థులు ఉదయం ప్రార్థన చేస్తుండగా.. స్కూల్ ఆవరణలోకి ప్రవేశించిన నిందితుడు.. ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ దారుణంలో ఇద్దరు అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆయుధాలతో స్కూల్‌లోకి వచ్చిన దుండగుడు.. కిటికీల గుండా పిల్లలపైకి కాల్పులకు తెగబడ్డాడు.

ఆ తర్వత నిందితుడు తనను తాను షూట్ చేసుకుని చనిపోయాడని అధికారులు వెల్లడించారు. నిందితుడు వయసు 20 ఏళ్లు ఉంటుందని తెలిపారు. కాల్పుల ఘటనలో సుమారు 17 మంది గాయపడ్డారని.. వీరిలో 14 మంది విద్యార్థులే అని అధికారులు తెలిపారు. ఈ పాఠశాలలో మొత్తం 350 మంది విద్యార్థులు చదువుతున్నారని వెల్లడించారు. ఈ సంఘటన మీద మిన్నెసోటా గవర్నర్‌ టిమ్‌ వాల్జ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పసిపిల్లలపై ఇలా కాల్పులకు తెగబడటం దారుణమన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.