కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. జి.ఆర్. కాలనీ పూర్తిగా నీట మునిగింది. దీంతో తమను కాపాడాలంటూ వీడియోలను సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపైకి చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సహాయక చర్యలు చేపట్టారు. వరదల వల్ల వరి, మక్కజొన్న, పత్తి పంటలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు.

కామారెడ్డి జిల్లాలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాబోయే గంటల్లో పిడుగులు, ఉరుములు, గాలివానలతో కూడిన తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక గ్రామాలు నీట మునిగిపోయి, ప్రజలు ఇళ్ల పైకప్పులపైకి వెళ్లి ప్రాణాలను రక్షించుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ జిల్లాల్లో అత్యంత భారీ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే ఇక్కడ అత్యంత ప్రభావితమైన ప్రాంతంగా జి.ఆర్ కాలనీ నిలిచింది.

ఇక్కడ 1st ఫ్లోర్ వరకు నీరు చేరడంతో కాలనీవాసులు “మమ్మల్ని రక్షించండి” అంటూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రక్షణ బృందాలు సహాయక చర్యలకు దిగినా.. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ఆపరేషన్లు కష్టంగా మారాయి. దయచేసి మమ్మల్ని రక్షించాలని వీడియోలను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు.
అలాగే మెదక్ జిల్లాలోని ధూప్‌సింగ్ తండా పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వరద నీటితో ఇండ్లు పూర్తిగా మునిగిపోవడంతో ప్రజలు పైకప్పులపైకి ఎక్కి బతుకుదెరువు కోసం పోరాడుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు పడవలతో రక్షణ చర్యలు చేపడుతున్నా, వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రమాదం తగ్గట్లేదు.