ఆరోగ్య బీమా అనేది ఈ రోజుల్లో తప్పనిసరిగా ఉండాలన్న ఉద్దేశం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ముఖ్యంగా కొవిడ్ తర్వాతి కాలంలో దీని గురించి అవగాహన పెరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్తో వైద్య ఖర్చులు భారీగా తగ్గుతాయని చెప్పొచ్చు. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్య బీమాపై జీఎస్టీ ఎత్తేస్తున్నారన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అసలు ఆరోగ్య బీమా ఎంతకు తీసుకోవాలి.. ఎప్పుడు తీసుకోవాలి.. వంటి వివరాలు చూద్దాం.
ద్రవ్యోల్బణం అనేది పెరుగుతూ పోతుంటుంది. ఈ క్రమంలోనే మన ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ముఖ్యంగా వైద్య ఖర్చులు భరించలేని స్థాయిలో ఉంటాయి. అందుకే అందరికీ ఆరోగ్య బీమా ఉండాలనే అభిప్రాయం కలుగుతోంది. కరోనా తర్వాతి కాలంలో దీని అవసరం ఇంకా తెలిసొచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది.. వైద్య ఖర్చుల్ని భారీగా తగ్గిస్తుంది. మనకు ఎంతో ఆదా చేస్తుందని చెప్పొచ్చు. దీంతో అత్యవసర సమయాల్లో కుటుంబానికి అండగా నిలుస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద ఆపరేషన్ల వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అందుకే.. ప్రతి ఒక్కరూ తమ స్థోమతకు తగ్గట్లుగా తగినంత ఆరోగ్య బీమా కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మీరు ఇక్కడ ఎంత పాలసీ తీసుకోవాలి.. ఎప్పుడు తీసుకోవాలి.. వంటి విషయాలపై కాస్త అవగాహన పెంపొందించుకోవాలి. ఈ వివరాల్ని చూద్దాం.


కుటుంబంలో నలుగురైదుగురు ఉన్నట్లయితే.. అక్కడ బీమా కవరేజీ మొత్తం కుటుంబ పెద్ద (సంపాదించే వ్యక్తి) వార్షిక వేతనానికి సమానంగా ఉండాలి. లేకపోతే కనీసం రూ. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. తక్కువ ఆదాయం ఉన్న వారు కూడా.. ప్రస్తుత వైద్య ఖర్చుల నేపథ్యంలో కనీసం రూ. 5 లక్షల కవరేజీ ఉండే పాలసీ తీసుకోవాలని సూచిస్తున్నారు.

Where can I get some?
>> మీరు ఇన్సూరెన్స్ కవరేజీపై నిర్ణయం తీసుకునేముందు.. బీమా కొనుగోలు చేసే వ్యక్తి వయసును కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా సీనియర్ సిటిజెన్స్కు అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి తగినంత మొత్తంతో పాలసీ తీసుకోవాలి. సీనియర్ సిటిజెన్లకు ప్రీమియం కాస్త ఎక్కువే ఉంటుంది.

