తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించిన ప్రభుత్వం, ఆయన స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. తెలంగాణతో పలు రాష్ట్రాల గవర్నర్లు బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించిన రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా, కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను తమిళనాడు గవర్నర్‌గా, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరణ్ జిత్ సంధూను నియమించారు.
కాగా, త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మను 2024లో తెలంగాణ గవర్నర్‌గా నియమించిన విషయం తెలిసిందే. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివప్రతాప్ శుక్లా, ప్రధాని మోదీ తొలి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ సహాయమంత్రిగా పని చేశారు. 2023 నుంచి హిమాచల్ గవర్నర్‌గా ఉన్న శుక్లాను ఇప్పుడు తెలంగాణకు బదిలీ చేశారు.


