తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం సష్టం చేస్తూ పిటిషన్ కొట్టివేసింది. అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్ వేయించామని పేర్కొంది. ఏదైనా ఉంటే సీబీఐ ముందే చెప్పుకోవాలని సూచించింది.


