తెలంగాణ శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు అసెంబ్లీలో భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు జీవో చూపించండి. ఇక్కడే రాజీనామా చేసి నేను వెళ్లిపోతాను అంటూ సవాల్ విసిరారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించవద్దంటూ డిప్యూటీ సీఎంకు సూచించారు. భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు అబద్ధమని, రాష్ట్రంలోని మహిళలంతా చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నది తప్పు మాట అని అన్నారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలని సినిమా చూపించిందే కాంగ్రెస్ అని, సోనియా గాంధీని బలిదేవత అని తాము అనలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.


