My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - Telangana

ఉగాది వేళ సీఎం రేవంత్ రెడ్డి .. గుడ్ న్యూస్

తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. మార్చి 22వ తేదీన రైతు భరోసా పథకం కింద నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌ లో జరిగిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ కొత్త తెలుగు సంవత్సరాన్ని రైతుల సంక్షేమానికి అంకితం చేస్తున్నామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజుగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ […]

తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. మార్చి 22వ తేదీన రైతు భరోసా పథకం కింద నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌ లో జరిగిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ కొత్త తెలుగు సంవత్సరాన్ని రైతుల సంక్షేమానికి అంకితం చేస్తున్నామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజుగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా అందిస్తున్నామని గుర్తుచేశారు. ఇప్పటికే రైతు భరోసా కింద రూ.18,000 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. రుణభారంతో ఉన్న రైతులకు పెద్ద ఊరటనిస్తూ రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని తెలిపారు. దేశంలోనే అత్యంత తక్కువ రుణభారం ఉన్న రైతులు తెలంగాణలోనే ఉన్నారని చెప్పడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలోని 70 శాతం కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.