తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27న శ్రీరామనవమి రోజు పార్టీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశముందని సమాచారం. శ్రీరామనవమి రోజు ఉదయం 8 గంటలకు కొత్త పార్టీ ఏర్పాటు తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలంగాణ జాగృతి వర్గాలు చెబుతున్నాయి.ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన ముఖ్య అంశాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన మెట్టినిల్లు నుంచి పార్టీ సింబల్, విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉందని జాగృతి వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా, కవిత తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ఇదే సందర్భంలో వెల్లడించవచ్చని చర్చ జరుగుతోంది.


