జగిత్యాలలో మాజీ సిఎం కెసిఆర్ సభ జరిగే సమయానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభ పెట్టారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. పులిని చూసి నక్క వాలు పెట్టుకున్నట్లు చేశారని అన్నారు. కెసిఆర్ స్థాయి ఏందో, రేవంత్ రెడ్డి స్థాయి ఏందో ప్రజలకు అర్థమైందని తెలియజేశారు. రేవంత్ రెడ్డి మాత్రం కడుపుమంటతో మాట్లాడారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలపై కెసిఆర్ హుందాగా మాట్లాడారని కొనియాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం, దాన్ని ఆపడం రేవంత్ రెడ్డి తరం కాదని, కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవదని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తే, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు అయినా దక్కుతాయని, తమ ఢిల్లీ పర్యటనపై రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. తమ ఢిల్లీ పర్యటనలో రహస్యం ఏమీ లేదని, కాళేశ్వరం కేసుకు సంబంధించి న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లామని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి ముందు రోజు రాత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారని, ఆ తర్వాత రోజు ఆర్ఎస్ఎస్ కు చెందిన కేంద్ర మంత్రిని కలిశారని అన్నారు. రెండు రైతు భరోసాలు ఎగ్గొట్టారని మండిపడడ్డారు.


