ఆస్ట్రేలియాలోని పాయింట్ కుక్ మెల్బోర్న్లో టీడీపీ మెల్బోర్న్ అధ్యక్షుడు శ్రీకాంత్ కొణెదన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపాధ్యక్షురాలు సుమ తాతినేని కీలక పాత్ర పోషించారు. టీడీపీ మెల్బోర్న్ అధ్యక్షుడు శ్రీకాంత్ కొణెదన మాట్లాడుతూ చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని, టెక్నాలజీ, అభివృద్ధి విషయంలో ముందుచూపు ఉన్న నాయకుడని కొనియాడారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే సామర్థ్యం ఆయనకు ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యక్షురాలు సుమ తాతినేని మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా అందుతున్నాయని తెలిపారు.
టీడీపీ సభ్యులు సుమన్, రాజీవ్, శ్రీకాంత్ చావా, కేవీ తదితరులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కలిసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, చంద్రబాబు దీర్ఘాయుష్షుతో, ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు. ఆయన నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కాంక్షించారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు కూడా తమ రాష్ట్రంపై ఉన్న ప్రేమను, నాయకుడిపై ఉన్న అభిమానాన్ని ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తపరిచారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.


