రెండేళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది అధికారం కాదు, బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. తిరుపతి జిల్లా దామినేడులో రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి, సంక్షేమం నినాదంతో కూటమి విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్బంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ ఈ విజయం పార్టీలది కాదు, ప్రజలది అని అన్నారు. చారిత్రక విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అహంకార విధ్వంసంపై ప్రజలు సాధించిన విజయం ఇది అని 2024 ఎన్నికల్లో ప్రజలు అహంకారాన్ని తిరస్కరించారని, 2024 లో ప్రజలు ఓటు వేయడమే కాదు, చరిత్ర తిరగరాశారని కొనియాడారు. ఒక తరం భవిష్యత్ కు నమ్మకాన్ని కల్పించారని, ఎపి పునర్నిర్మాణం కూటమి బాధ్యత అని పవన్ తెలియజేశారు. 21 సీట్లతో రాజీపడలేదని, ఎపి కోసం త్యాగం చేశామని, తమకు ప్రజలు వందశాతం స్ట్ర్రైక్ రేట్ ఇచ్చారని పేర్కొన్నారు.


