డెన్మార్క్‌లో మినీ మహానాడు, ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌లు వర్చువల్‌గా మాట్లాడారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు ద్వితీయ వర్థంతి సందర్భంగా ఆయనకు సంతాపం తెలిపారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపులో ఎన్నారైలు కీలకపాత్ర పోషించారని మంత్రి కొల్లు రవీంద్ర, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో హరిబాబు చెరుకూరి, సీతారామయ్య జాస్టి, సుధాకర్ చాగంటి, మధుబాబు నిమ్మగడ్డ, బాలకృష్ణ యాగంటి, ప్రవీణ్ జంపని తదితరులు పాల్గొన్నారు.


