మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిరుబాబీ2 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వాల్తేరు వీరయ్య భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన హై-ఎనర్జీ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవి, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. నెక్స్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.


