ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండుగ ఫిఫా వరల్డ్ కప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. కెనడాలోని టొరంటో సిటీలో జరిగిన రెండవ ఓపెనింగ్ వేడుకలలో స్టేజ్‌పై బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్, గ్లోబల్ ఐకాన్ నోరా ఫతేహి తన పర్ఫార్మెన్స్‌తో దుమ్మురేపింది. కెనడా వర్సెస్ బోస్నియా మ్యాచ్‌కు ముందు జరిగిన ఈ వేడుకల్లో ఆమె వేదికపై నిప్పులు చెరిగే డ్యాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. రెడ్ కలర్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోయిన నోరా ఫతేహి, ఈ ఫిఫా టోర్నమెంట్ అధికారిక ఆల్బమ్ లోని సీర్ సీర్ అనే గ్లోబల్ ఫుట్‌బాల్ యాంథమ్‌ను లైవ్‌గా ఆలపించి, డ్యాన్స్ చేసింది. ఈ ప్రదర్శనలో ఆమెతో పాటు ప్రసిద్ధ ఫ్రెంచ్ సింగర్ వెజిడ్రీమ్, ప్రముఖ మ్యూజిక్ ప్రొడ్యూసర్ సంజోయ్ కూడా జతకలిశారు. వీరి ముగ్గురి కాంబినేషన్‌లో వచ్చిన ఈ హై-ఎనర్జీ సాంగ్‌కు స్టేడియంలోని వేలాది మంది అభిమానులు ఫిదా అయిపోయారు.


