గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. 26 మంది సభ్యులతో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం వారంతా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో నిర్వహించిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రివర్గంలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా కు కూడా చోటు దక్కింది. ఆమె కూడా ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్లోని రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా తన కూతురుతో కలిసి హాజరయ్యారు.


